కులములోన నొకఁడు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణముచేత
వెలయు వనములోన మలయజమున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : ఓ వేమా! వంశములో ఒకడు గుణవంతుడు ఉన్నచో ఆ వంశమునకు వాని మంచిగుణములచే కీర్తి వచ్చును. అడివిలోన చందనము చెట్టుండిన ఆ అడవి కంతటికీ గొప్పతనము వచ్చునుగదా.
౧౧. అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను...
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండుఁ బల్కుఁ జల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : నీచుడు డంబములు చెప్పుచుండును. మంచివారు మెల్లగా మాటలాడుచుందురు. తక్కువ ఖరీదైన లోహము అయిన కంచు దడదడమని మ్రోగునట్లు, యెక్కువ ఖరీదైన బంగారము అను లోహము మ్రోగదుకదా!

౧౦. నిండునదులు పారు నిలచి గంభీరమై...
నిండునదులు పారు నిలచి గంభీరమై
వెఱ్రివాగు పారు వేగఁబొర్లి
అల్పుడాడురీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ వినురవేమా.
తాత్పర్యము : ఓ వేమా! నీటితో నిండియున్న నదులు గంభీరముగ నిలచి పారుచుండును. చిన్న సెలయెరులు పైకి పొర్లి వేగముగ ప్రవహించు చుండును. ఛెడ్డ గుణములు గలవారు మాటలాడి నంతటి తొందరగా మంచి గుణములు గలవారు మాట్లాడరు.

౯. గంగ పారునెపుఁడు గదలని గతితోడ...
గంగ పారునెపుఁడు గదలని గతితోడ
మురికివాగు పారు మ్రోతతోడ
పెద్దపిన్నతనము పేర్మి యీలాగురా,
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : ఓ వేమా! మంచినీటి ప్రవాహము నిశ్శబ్దముగ పారుచుండును. మురికినీటి కాలువ పెద్ద చప్పుడు చేయుచు ప్రవహించు చుండును. మంచివారికీ, చెడ్డవారికీ తేడా ఆ విధముగనే ఉండును.

౮. నేరనన్నవాఁడు నెరజాణ మహిలోన...
నేరనన్నవాఁడు నెరజాణ మహిలోన
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : ఓవేమా! ఈ ప్రపంచములో తనకు అన్నియు తెలుసునని డంబములు చెప్పువాడు తుదకు నిందలపాలగును. తనకు ఏమియు తెలియదని చెప్పువాడు మంచి తెలివితేటలు గలవాడు. అనవసరముగ ఏమియు చెప్పక మౌనముగ నుండువాడే గొప్ప బుద్ధిమంతుడు.
నేర్తునన్నవాఁడు నిందజెందు
ఊరకున్నవాఁడె యుత్తమయోగిరా!విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : ఓవేమా! ఈ ప్రపంచములో తనకు అన్నియు తెలుసునని డంబములు చెప్పువాడు తుదకు నిందలపాలగును. తనకు ఏమియు తెలియదని చెప్పువాడు మంచి తెలివితేటలు గలవాడు. అనవసరముగ ఏమియు చెప్పక మౌనముగ నుండువాడే గొప్ప బుద్ధిమంతుడు.
౭. మేడిపండుచూడ మేలిమై యుండును...
మేడిపండుచూడ మేలిమై యుండును
పొట్టవిప్పిచూడఁ బురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : ఓవేమా! మేడిపండు చూచుటకు పైకి పచ్చగా బంగారమువలె కంటికింపుగా కనబడును. కాని, దానిని బ్రద్ధలుచేసి చూచినచో లోపల పురుగులు ఉండును. చెడ్డవారు చూచుటకు పైకి బాగుగనే కన్పించుచున్ననూ, లోపల వారి గుణములు మాత్రము చెడ్డవిగ ఉండును.

౬. మృగమదంబుజూడ మీద నల్లగనుండు...
మృగమదంబుజూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైనవారి గుణములీలాగురా!
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : ఓ వేమా! కస్తూరి చూచుటకు నల్లగా నుండును. కాని, దాని సువాసన విశేషమైన గొప్పదిగ నుండును. గురువులైన వారిలో మంచి గుణములు గూడ ఆ విధముగనే చాలా గొప్పవిగా నుండును.

౫. మిరపగింజచూడ మీద నల్లగనుండు...
మిరపగింజచూడ మీద నల్లగనుండు
గొరికిచూడ లోనజురుకు మనును
సజ్జనులగువారి సారమిట్లుండురా!
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : మిరపగింజ చూచుటకు నల్లగా ఉండును. నోటిలో పెట్టుకొని పంటితో కొరికినచో చురుక్కుమని మండును. ఆ విధముగనే మంచి గుణములు గలవారిలో గొప్ప ప్రభావముండునని తెలిసికొనుము.

౪. నిక్కమైన మంచినీల మొక్కటిచలు...
నిక్కమైన మంచినీల మొక్కటి చాలు
దళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల
చాటుపద్య మిలను చాలదా యొక్కటి?
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : శ్రేష్టమైన నీలము అను రత్నము ఒక్కటి ఉన్ననూ చాలును. రత్నములవలె తళతళమెరయుచుండు రాళ్ళుతట్టెడున్ననూ ప్రయోజనము లేదుగదా. ఆవిధముగనే యీ లోకములో నీతిని బోధించుచాటు పద్యము ఒక్కటైననూ చాలును.

౩. గంగిగోవుపాలు గంటెడైన చాలు...
గంగిగోవుపాలు గంటెడైన చాలు
కడివెడైననేల ఖరముపాలు
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు,
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : మంచి ఆవుపాలు గరిటెడైను త్రాగుటకు శ్రేష్టముగా నుండును. గాడిదపాలు కడవతో ఇచ్చిననూ త్రాగలేముకదా: అట్లే ప్రేమతోబెట్టిన భోజనము పిడికెడైననూ సంతోషమేగదా.

౨. ఆత్మశుధ్ధి లేని యాచారమదియేల?...
ఆత్మశుధ్ధి లేని యాచారమదియేల?
భాండశుధ్ధి లేని పాకమేల?
చిత్తశుధ్ధిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : నిర్మలమైన మనస్సుతో చేయని ఆచారమువలన ప్రయోజనములేదు. వంటచేసుకొను కుండను తోమకనే వంటచేసిన ఆ పధార్థము తినిటకు మంచిదికదు గదా. అట్లే నిశ్చలమైన మనస్సుతో చేయని శివపూజలవలన పుణ్యము లభింపదు.

౧. చిత్తశుధ్ధి గలిగి చేసిన పుణ్యంబు...
చిత్తశుధ్ధి గలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువకాదు
విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : ఓ మంచి బుధ్ధిగలవాడా! శ్రీరామచంద్రుని కృపచేత, సకల జనులు ఆశ్చర్యపడునట్లు ప్రసిధ్ధమైన ధారాళమైన నీతులను, వినువారికి నోరూరించునటువంటి రుచులు పుట్టునట్లుగా చెప్పెదను.

Subscribe to:
Posts (Atom)