గంగిగోవుపాలు గంటెడైన చాలు
కడివెడైననేల ఖరముపాలు
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు,
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : మంచి ఆవుపాలు గరిటెడైను త్రాగుటకు శ్రేష్టముగా నుండును. గాడిదపాలు కడవతో ఇచ్చిననూ త్రాగలేముకదా: అట్లే ప్రేమతోబెట్టిన భోజనము పిడికెడైననూ సంతోషమేగదా.
