౫. మిరపగింజచూడ మీద నల్లగనుండు...

మిరపగింజచూడ మీద నల్లగనుండు
గొరికిచూడ లోనజురుకు మనును
సజ్జనులగువారి సారమిట్లుండురా!
విశ్వదాభిరామ వినురవేమ.

తాత్పర్యము : మిరపగింజ చూచుటకు నల్లగా ఉండును. నోటిలో పెట్టుకొని పంటితో కొరికినచో చురుక్కుమని మండును. ఆ విధముగనే మంచి గుణములు గలవారిలో గొప్ప ప్రభావముండునని తెలిసికొనుము.