౧౦. నిండునదులు పారు నిలచి గంభీరమై...

నిండునదులు పారు నిలచి గంభీరమై
వెఱ్రివాగు పారు వేగఁబొర్లి
అల్పుడాడురీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ వినురవేమా.

తాత్పర్యము : ఓ వేమా! నీటితో నిండియున్న నదులు గంభీరముగ నిలచి పారుచుండును. చిన్న సెలయెరులు పైకి పొర్లి వేగముగ ప్రవహించు చుండును. ఛెడ్డ గుణములు గలవారు మాటలాడి నంతటి తొందరగా మంచి గుణములు గలవారు మాట్లాడరు.